📽️ ఉచితంగా సినిమా టికెట్లు అందించే 5 బెస్ట్ క్రెడిట్ కార్డులు ఇవే! మూవీ లవర్స్‌కి అదిరిపోయే ఆఫర్లు! | Top5 Credit Cards For Save Money On Movie Tickets | Free Movie Tickets Offer Credit Cards List 2025
సినిమా అంటే పిచ్చి ఉన్నవాళ్లకు, కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే టికెట్ బుక్ చేయాల్సిందే అనుకునే సినీ ప్రియులకు ఇది నిజంగా గుడ్‌న్యూస్. మీ జేబుకు పెద్దగా భారం పడకుండా, అస్సలు ఖర్చు లేకుండా సినిమా టికెట్లు పొందాలనుకుంటే కొన్ని రకాల క్రెడిట్ కార్డులు మీకు బాగా ఉపయోగపడతాయి. బుక్‌మైషో (BookMyShow) లేదా పేటీఎం (Paytm) వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్స్‌లో చాలా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కి స్పెషల్ డిస్కౌంట్లు, లేదా ఏకంగా ఉచిత సినిమా టికెట్లు కూడా అందిస్తున్నాయి. అయితే, ప్రతి క్రెడిట్ కార్డ్‌కు కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని తెలుసుకుంటే మీరు సులువుగా ఈ ఆఫర్లను వాడుకోవచ్చు. ఇక్కడ మేము మూవీ లవర్స్‌కి ఉపయోగపడే బెస్ట్ 5 క్రెడిట్ కార్డ్‌ల వివరాలు, వాటి ఆఫర్లను అందిస్తున్నాం.
1. ఎస్బీఐ కార్డ్ ఎలైట్ (SBI Card ELITE): ఏకంగా రూ.6,000 ఆదా!
మీరు తరచుగా సినిమాలు చూసేవారైతే, ఎస్బీఐ కార్డ్ ఎలైట్ మీకు బెస్ట్ ఆప్షన్. ఈ ప్రీమియం క్రెడిట్ కార్డుతో బుక్‌మైషోలో మీకు ‘బై వన్ గెట్ వన్ ఫ్రీ’ (BOGO) ఆఫర్ లభిస్తుంది. అంటే, మీరు ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితంగా వస్తుంది. అయితే, ఈ ఆఫర్ ద్వారా నెలకు రెండుసార్లు, ఒక్కో టికెట్‌పై రూ.250 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఒక సంవత్సరంలో మీరు కేవలం సినిమా టికెట్లపైనే దాదాపు రూ.6,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది నిజంగా పెద్ద మొత్తమే కదా!
2. ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డ్ (ICICI Bank Coral Credit Card)
మీరు సాధారణంగా సినిమా టికెట్లను బుక్‌మైషో ద్వారా బుక్ చేస్తుంటే, ఐసీఐసీఐ కోరల్ క్రెడిట్ కార్డ్ మీకు 25% డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ కింద నెలకు రెండు సినిమా టికెట్లపై తగ్గింపు పొందవచ్చు. ప్రతి డిస్కౌంట్ లిమిట్ టికెట్‌పై రూ.100గా నిర్ణయించారు. మీరు తక్కువ ఖర్చుతో రెగ్యులర్‌గా సినిమాలు చూడాలనుకుంటే, ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్లు చాలా లాభదాయకంగా ఉంటాయి.
3. హెచ్డీఎఫ్సీ టైమ్స్ కార్డ్ క్రెడిట్ (HDFC Times Card Credit)
రెగ్యులర్‌గా సినిమాలు చూసేవారికి HDFC టైమ్స్ కార్డ్ మరో మంచి ఆప్సన్. బుక్‌మైషోలో దీనిపై ప్రతి ట్రాన్సాక్షన్‌కి మ్యాగ్జిమం రూ.350 వరకు, ఒక్కో టికెట్‌కి రూ.150 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా, మీరు ప్రతి నెలా నాలుగు వరకు డిస్కౌంట్ టికెట్లను ఈ కార్డ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి, ప్రతి నెల కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలనుకునేవారికి ఇది చక్కటి అవకాశం.
4. యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ (Axis Bank My Zone Credit Card)
మీరు పేటీఎం ద్వారా మూవీ టికెట్లను బుక్ చేసుకునే అలవాటు ఉంటే, యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ వాడితే నెలకు ఒక ఉచిత సినిమా టికెట్ పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా మీరు రూ.200 వరకు ఆదా చేయగలుగుతారు. నెలకు కనీసం ఒక్క సినిమా చూసినా, ఈ కార్డ్ మీ జేబుకు ఉపశమనం ఇస్తుంది. ఈ ఉచిత సినిమా టికెట్లు ఆఫర్‌ను వాడుకోవడం చాలా సులభం.
5. కోటక్ పీవీఆర్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ (Kotak PVR Platinum Credit Card)
మీరు పీవీఆర్ (PVR) థియేటర్లలోనే సినిమా చూడటానికి ప్రాధాన్యత ఇస్తే, కోటక్ పీవీఆర్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ మీకు బెస్ట్ సూట్ అవుతుంది. ఈ కార్డ్ మీకు ప్రతి నెలా రెండు ఉచిత సినిమా టికెట్లు ఇస్తుంది. అయితే, ఈ ఆఫర్‌కు అర్హత పొందాలంటే మీ బిల్లింగ్ సైకిల్లో మీరు కనీసం రూ.10,000 ఖర్చు చేయాలి. కార్డును రెగ్యులర్‌గా వాడుతుంటే, ఈ స్పెండింగ్ లిమిట్‌ని క్రాస్ చేయడం చాలా సులభం. దీని ద్వారా మీకు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టకుండానే ఉచిత సినిమా టికెట్లు లభిస్తాయి.
ఒక చిట్కా: మీ క్రెడిట్ కార్డును ఆక్టివ్‌గా ఉంచడం మర్చిపోవద్దు!
మీరు క్రెడిట్ కార్డును 12 నెలలకు పైగా ఉపయోగించకపోతే, బ్యాంక్ మీ అకౌంట్‌ను క్లోజ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయవచ్చు. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి, మీ కార్డును యాక్టివ్‌గా ఉంచాలంటే సంవత్సరానికి కనీసం ఒక్కసారి అయినా చిన్న ట్రాన్సాక్షన్‌కు వాడితే సరిపోతుంది. ఆ చిన్న ట్రాన్సాక్షన్ సినిమా టికెట్ బుక్ చేయడం అయినా పర్వాలేదు! మీ డబ్బు ఆదా అవ్వడం, క్రెడిట్ కార్డు యాక్టివ్‌గా ఉండడం… రెండూ ఒకేసారి జరిగిపోతాయి. మీరు కూడా ఈ బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి మీ సినిమా ఖర్చును తగ్గించుకోవచ్చు!
మీరు క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఆదా చేసిన డబ్బుతో ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఆ వివరాలను కామెంట్లలో పంచుకోండి.